అధిక బరువు, పొట్ట, నడుము, దగ్గర పేరుకొనే కొవ్వు తగ్గించేందుకు యోగాసనాలు

అధిక బరువు అందరికీ సమస్యే. ముఖ్యంగా పొట్ట, నడుము, పిరుదుల దగ్గర పేరుకొనే కొవ్వు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు యోగాసనాలు.

సేతు బంధాసనం

ఆసనం వేసినప్పుడు వారధిలా ఉంటుంది కాబట్టి దీన్ని సేతుబంధాసనం అంటారు. వెల్లకిలా పడుకొని రెండు కాళ్లు మడిచి రెండు కాళ్ల మడమలను రెండు పిరుదుల దగ్గరా పెట్టుకోవాలి. రెండు చేతులు రెండు కాలి మడమలని తాకించి ఉంచాలి. ఇప్పుడు మెల్లగా గాలి తీసుకొంటూ పిరుదులనీ నడుమునీ పైకి లేపాలి. పది సెకన్ల తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ పిరుదులను నేలకు ఆనించాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి. పిరుదుల భాగం తగ్గాలనుకొనే వారు ఇరవై నుంచి ముప్ఫై సార్లు చెయొచ్చు. దీని వల్ల పొట్ట, తొడల భాగంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.
 బూనామాసన్‌


కూ
ర్చుని కాళ్లను ముందుకు చాచాలి. రెండు చేతులు కుడివైపున నేలపై ఆన్చి, గాలిని వదిలేస్తూ కుడివైపు పక్కకు నుదుటిని నేలకు తాకించాలి. గాలి తీసుకొంటూ సమస్థితిలోకి రావాలి. ఇలాగే ఎడమ వైపు గాలి వదులుతూ నేలను తాకించాలి. గాలి తీసుకొంటూ సమస్థితికి రావాలి. ఇలా కుడివైపు ఎడమవైపు రోజుకి యాభైసార్లు చెయ్యాలి. దీని వల్ల పొట్ట నడుం దగ్గర ఉండే కొవ్వు బాగా తగ్గుతుంది.

విపరీత పవన ముక్తాసనం


వె
ల్లకిలా పడుకొని మెల్లగా కుడికాలిని పైకి మడిచి కుడి మోకాలిని పొట్ట వైపునకు తీసుకొచ్చి రెండు చేతులతో కుడి మోకాలిని పట్టుకొని ఎడమకాలిని గుండ్రంగా ఐదుసార్లు కుడివైపునకు... ఐదుసార్లు ఎడమవైపునకు తిప్పాలి. మెల్లగా సమస్థితిలోకి వచ్చి తిరిగి మరలా ఎడమకాలిని మడిచి పొట్టవైపు రెండు చేతులతో ఒత్తి పట్టుకొవాలి. ఇలాంటప్పుడు మోకాలికి చుబుకాన్ని కానీ నుదుటిని కానీ ఆనించడానికి ప్రయత్నించాలి. కుడి కాలిని ఐదుసార్లు ఎడమవైపు... ఐదుసార్లు కుడివైపు తిప్పాలి. ఈ ఆసనం వల్ల పొట్ట, పొత్తి కడుపు దగ్గర కొవ్వు తగ్గుతుంది. పిరుదుల దగ్గరుండే కొవ్వు తగ్గుతుంది. మెడనొప్పితో బాధపడే వారు తలని పైకెత్తకుండా కాలిని మాత్రమే మడిచి చెయ్యవచ్చు.

చక్కీచాలన్‌



క్కీ అంటే తిరగలి. తిరగలి రాయి ఎలా గుండ్రంగా తిరుగుతుందో అలానే నడుము కూడా తిప్పాలి కాబట్టి దీన్నలా అంటారు. రెండు అరచేతి వేళ్లను కలిపి పట్టుకొని ముందు కుడివైపు నుంచి గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాలి. ఇలా మూడుసార్లు తిరగాలి. తిరిగి ఎడమ వైపు నుంచి మొదలుపెట్టి మూడుసార్లు తిరగాలి. ఇలా చేసేటప్పుడు దృష్టంతా నడుము, పొట్టమీదే ఉంచాలి. కాళ్లను స్థిరంగా ఉంచి నడుమును మాత్రమే తిప్పాలి. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట, నడుము భాగంలో కొవ్వు తగ్గుతుంది. నడుం నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లు దీనిని చెయ్యకూడదు.

అగ్నిసార ప్రాణాయామం


సు
ఖాసనంలో కూర్చొని ముందుగా గాలి తీసుకుని..దానిని మొత్తం బయటకు వదిలేయాలి. అలాగే ఉండి పొట్టను ముందుకు వెనక్కి కదిలించాలి. ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అలా పది, ఇరవై, ముప్ఫైసార్లు చేయవచ్చు. ఇలా చేసేటప్పుడు గాలిని తీసుకోకూడదు. పొట్టను మాత్రమే కదిలించాలి. చివరలో మళ్లీ గాలి తీసుకొంటూ రిలాక్స్‌ అవ్వాలి. దీనిని ఖాళీ కడుపుతోనే చెయ్యాలి. ఉదయాన్నే చేస్తే మంచిది. అధిక బరువునూ, కొవ్వునూ తగ్గిస్తుంది. హెర్నియా, అల్సర్లు, గుండె సంబంధిత
జబ్బులున్న వారు వైద్యుల సలహాతో జాగ్రత్తగా చెయ్యాలి. ఐదువేళ్లను చిత్రంలో చూపినట్టుగా ఉంచడం వల్ల గాలిని ఎక్కువ సేపు ఆపగలుగుతాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top