మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు

F
పరమశివుడు భారతదేశం మొత్తం మీద పన్నెండు చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణోక్తి. ఆ పన్నెండు ప్రదేశాలలో ఉన్న లింగ విగ్రహాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. వాటి వివరాలు ఇవి.

సోమనాథుడు లేక సోమేశ్వరుడు - గుజరాత్‌లోని వీరావల్ దగ్గర వున్న ప్రభాస పట్టణం (సోమనాథ్)

మల్లికార్జునుడు - ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం

కేదారనాథుడు - హిమాలయాలలోని కేదారనాథ్

విశ్వనాథుడు- ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి
 
త్యంబకేశ్వరుడు - మహారాష్టల్రోని నాసిక్ వద్ద త్య్రంబకేశ్వరం

ఘృష్ణేశ్వరుడు - మహారాష్టల్రోని ఎల్లోరా గుహల వద్ద

రామేశ్వరుడు - తమిళనాడులోని రామేశ్వరం

మహాకాళుడు - మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని

ఓంకారేశ్వరుడు లేక అమరేశ్వరుడు లేక అమలేశ్వరుడు - మధ్యప్రదేశ్‌లోని కాండ్వాకు దగ్గరలో నర్మదానది ఒడ్డున ఉన్న మెర్టక్క అనే చోట

భీమశంకరుడు - మహాష్టల్రోని ముంబై- పుణెల మధ్య ఉన్న నెరల్ అనే చోట/ అస్సాంలోని గౌహతి దగ్గర ఉన్న బ్రహ్మపూర్ అనే కొండ శిఖరం మీద

వైద్యనాథుడు - హైదరాబాద్‌కు ఉత్తరంగా ఉన్న పర్లి వైద్యనాథ్/ బీహార్‌లోని సంతాల్ పరగణాలోని చిత్తభూమి

నాగేశ్వరుడు - గుజరాత్‌లోని ద్వారక దగ్గర, హైదరాబాద్‌కు ఉత్తరంగా మహారాష్టల్రో ఉన్న అవధ్‌గ్రామ్
చివరగా ఉన్న మూడింటి విషయంలో, ఎవరికి వారు తమ ఊరిలో ఉన్నదే అసలైన జ్యోతిర్లింగం అని చెబుతూ ఉంటారు. పండితులయిన వారి అభిప్రాయం కూడా నిష్కర్షగా ఫలానా ఊరు అని లేదు. కొందరు అది అని, మరికొందరు ఇది అని చెబుతూ ఉంటారు.
 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top