Vemana Sathakam



వేమన శతకములు  :
తామసించి చేయుతగా దెట్టి  కార్యంబు 
వేగిరింప నదియు విషమెయుగును 
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినురవేమ. 

చచ్చు వారలేవారు చావని వారేరి? 
చచ్చి బ్రతికియుండు  జనములేవరు?
విచ్చలవిడిగాను వివరించి చూడరా? 
విశ్వదాభిరామ వినురవేమ.


చంపగుడదేట్టి జంతువునైనాను
చంపవలయు లోక శత్రుగుణము
తెలకోండి గొట్టందే లేమిచేయురా 
విశ్వదాభిరామ  వినురవేమ.


ఆత్మయందే దృష్టి ననువగా నొనరించి 
నిశ్చలముగా  దృష్టి నిలిపెనేని 
అతడు నీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వదాభిరామ వినురవేమ. 


భూమి పేరు వల్ల పుణ్యస్తాలము లాయే 
వెలియ రాళ్ల వల్ల వేల్పులాయే 
నీళ్ళ పేర్ల వల్ల నిఖిల తిర్దములాయే
విశ్వదాభిరామ వినురవేమ.


నీళ్ళమునుగనేల నదుల మెట్టగనేల?
మొనసి తిర్దాములకు మొక్కనేల?
కపట కల్మషములు కడుపులో నుండంగ 
విశ్వదాభిరామ వినురవేమ. 


పాలపక్షి శకున ఫలమిచ్చు నందురు 
పాలపక్షి కేమి ఫలము తెలుసు 
తనకు కాని మంచి తనలోన యుండగా 
విశ్వదాభిరామ వినురవేమ.

గూబ గృహం జేరగు నిసిపాడుగ బెట్టి 
వెల్లిపోయోద రెంత వెర్రివారో
గూబ గృహం లేమి గూర్చురా ఖర్మంభు 
విశ్వదాభిరామ వినురవేమ.

 వ్రాత కొలది గాని వరమిడు దైవంబు 
చేతకొలది గాని వ్రాతకాదు 
వ్రాతకజుడు కర్తచేతకు తాకర్త 
విశ్వదాభిరామ వినురవేమ.

కుండ కుంభామన్న కొండ పర్వతమన్న 
ఉప్పు లవనమన్న నొకటి గాదె 
భాషలిట్లు వేరు పరతత్వ మొక్కటే 
విశ్వదాభిరామ వినురవేమ.


చెమట కారునట్లు శ్రమచేసి దేహంబు 
గడన జేసి కూడు కుడువవలయు 
తల్లితండ్రి సొమ్ము తాదింట కారాదు 
విశ్వదాభిరామ వినురవేమ.

కామిగానివాడు కవిగాడు రవిగాడు 
కామిగాక మోక్షకామి గాడు 
కామియౌనవాడు కవియౌను రవియౌను
విశ్వదాభిరామ వినురవేమ

పాపమనగా వేరే పరదేశమునలేదు
తనదు కర్మములను దగిలియుండు 
కర్మతంత్రి గాక గనుకని యుంతోప్పు
విశ్వదాభిరామ వినురవేమ.

పనుల వన్నె వేరుపా లేక వర్ణమౌ 
పుష్ప జాతి వేరు పూజ యొకటే 
దర్మనములు వేరు దేవంబు దొక్కటే 
విశ్వదాభిరామ వినురవేమ.

నీటి మీద  వ్రాత  నిలువకయున్నట్లు
పాటి జగతిలేదు పరము లేదు 
మాటమాట కెల్ల మనసు కోరుచునుండు 
విశ్వదాభిరామ వినురవేమ.

 ఇహము విడువ  ఫలము యింపుగా కలదని 
మహిని బలుకు వారి మతము కల్ల
యిహములోన పరము నేరుగుతగానరో 
విశ్వదాభిరామ వినురవేమ. 

తనువులోన జివతత్వ  మెరుంగక 
వెరేకలదటంచు వెదుకనేల
భానుడుండ దివ్వె బట్టి వెదుకురీతి 
విశ్వదాభిరామ వినురవేమ. 

గురువుతానయైన హరుని తాజుపును 
బ్రహ్మ లోకమతడు పారజూపు 
శిష్యునరసి పట్టి చీకటి బాపురా 
విశ్వదాభిరామ వినురవేమ.  

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top