Bala Thailam

బలాతైలం 
'బలా తైలం' తయారీలో 'బలా' అన్న మూలికను ప్రధానంగా వినియోగిస్తారు. అందుకే ఈ తైలానికి 'బలా తైలం' అన్న పేరు స్థిరపడింది. శరీర మర్ధనకే కాకుండా ఆయుర్వేద వైద్యులు ఈ తైలాన్ని కడుపులోకి, ముక్కులో వేయడానికి అలాగే ఎనిమాగా కూడా ఇస్తారు. రోగులకు బలం రావాలన్నా , ఆరోగ్యవంతుల బలం నిలవాలన్నా శరీరంలోని ధాతువులు, పునరుత్పత్తి క ణ జాలం, నాడీ వ్యవస్థను శక్తివంతం చేసే ప్రక్రియ జరగాలి.
ఇది బలాతైలం మర్ధనతో గానీ కడుపులోకి తీసుకోవడం వల్లగానీ సాధ్యమవుతుంది. కడుపులోకి కూడా తీసుకునే తైలాల తయారీలో ఎన్నో మార్లు పాకం (ఫోర్టిఫై) చేయడం వల్ల దీని శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందుకే ఈ తైలాన్ని తక్కువ మోతాదులో తీసుకున్నా సరిపోతుంది. ఇటీవలి కాలంలో ఈ తైలాన్ని జిలాటిన్ మాత్రల రూపంలో కూడా తయారు చేస్తున్నారు. ఇవి ఆయుర్వేద షాపుల్లో లభిస్తున్నాయి కూడా.
ఇవీ ప్రయోజనాలు
బలా తైలానికి నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఒక ప్రత్యేక గుణం ఉంది. అందుకే ఆయుర్వేద వైద్యులు దీన్ని వాత వ్యాధుల చికిత్సలో వాడుతుంటారు. ప్రధానంగా పక్షవాతం, అర్ధిత వాతం, ఏకాంగ వాతం, సర్వాంగ వాతం ఆక్షేపక వాతం (మూర్ఛ) వంటివి ఈ తైలం ద్వారా తగ్గిపోతాయి.


కీళ్లకు సంబంధించిన రుమాటిజం కీళ్లనొప్పుల ఉపశమన నానికి కూడా ఈ తైలాన్ని వాడతారు. శరీరం శక్తిహీనమైనప్పుడు కలిగే ధాతుక్షయ వ్యాధులను తగ్గించడంలో ఒక ప్రత్యేక చికిత్సగా కూడా ఈ తైలానికి గుర్తింపు ఉంది. ఈ తైలాన్ని కడుపులోకి తీసుకోవడం ద్వారా దెబ్బలు, కనిపించని గాయాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
స్త్రీలలో గర్భాశయ దోషాల కారణంగా సంతానం కలగని వారికి ఈ తైలం మంచి ఔషధంగా పనిచేస్తుంది. అండకణం సకాలంలో విడుదలై గర్భాశయంలోకి చేరడానికి ఈ తైలం బాగా తోడ్పడుతుంది. పురుషుల్లో బీజకణాల వృద్దికి, లైంగిక సామర్థ్యం పెరగడానికి కూడా ఈ తైలం ఉపయోగపడుతుంది.

తైలాన్ని కడుపులోకి తీసుకోవడంతో శ్వాసకోశాలు శక్తివంతమై దీర్ఘకాలిక ంగా ఉంటున్న శ్వాసకోశ సమస్యలెన్నో తొలగిపోతాయి. డిస్నియా వంటి శ్వాసపరమైన ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top